Om Maa Uroka Kavyam
ఊరంటే ఒక వల్లమాలిన ప్రేమ. ఊరంటే ఒక వొడవని ముచ్చట. ఊరంటే ఒక కలవరింత. ఊరంటే ఒక వలపోత. ఊరంటే ఒక జ్ఞాపకాల చెలిమి. ఊరంటే ఒక సలుపుతున్న గాయం. ఊరంటే ఒక ఊరడింపు. ఊరంటే ఒక సోపతిగాని అనురాగం. ఊరంటే ఒక తల్లి ఆత్మీయస్పర్శ. ఊరంటే ఒక కలల కలబోత. ఊరంటే తనువంత పులకరింత. ఊరంటే ఒక అనిర్వచనీయమైన పలకరింత. ఊరంటే ఉరకలెత్తుతున్న ఉత్సాహం. ఊరంటే ఆకాశంలో ఉరుముతున్న ధ్వని. ఊరంటే ఒక ఊరేగింపు. ఊరంటే ఒక పాటగాడి ఆలాపన. ఊరంటే ఒక తంగెడు పువ్వు నవ్వు. ఊరంటే చెరువు మత్తడి దూకుడు. ఊరంటే జలసవ్వడి. ఊరంటే మాటల పాటల సంగీత కచేరి. ఊరంటే పాలధారల వంటి ముచ్చట్లు. ఊరంటే సకల కళల, జనుల సామూహిక సముదాయం. ఊరంటే బావి గిరకల చప్పుళ్ళు ఊరంటే జన చైతన్య దివ్వెలు. ఊరంటే ఒక సింగిడి. ఊరంటే రమ్యమైన ఉద్యానవనం. సమాహార దృశ్య కవితా సంపుటి 'మా ఊరొక కావ్యం'.
--గోపగాని రవీందర్
Visa mer